నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: ఏంటి టింకూ.. ఏదో ఆలోచిస్తున్నావు?

Published : 30 Jun 2022 01:03 IST

ఎంత బాగుంటుందో!

టీచర్‌: ఏంటి టింకూ.. ఏదో ఆలోచిస్తున్నావు?
టింకు: ఏం లేదు టీచర్‌.. నిన్న మీరు ఆదిమ మానవుడి పాఠం చెప్పారు కదా.. దాని గురించే!

టీచర్‌: గుడ్‌.. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు?
టింకు: మనమంతా మళ్లీ ఆదిమ మానవులుగా మారిపోతే ఎంత బాగుంటుంది.. ఈ స్కూళ్లు, హోం వర్క్‌లు, పరీక్షలు ఇలా ఇవేమీ ఉండవు కదా టీచర్‌..

టీచర్‌: ఆఁ!!

కరెక్ట్‌గానే రాశాను!

టీచర్‌: ఏంటి బంటీ.. టీచర్‌ స్పెల్లింగ్‌ తప్పు రాశావు?
బంటి: లేదు టీచర్‌.. నేను కరెక్ట్‌గానే రాశాను..

టీచర్‌: సరిగా చూడు.. నువ్వు రాసింది టీచర్‌ అని కాదు.. టార్చర్‌ అని!
బంటి: ఓ.. అవునా! అయితే నేను రాసింది కరెక్టే మరి!

టీచర్‌: ఆఁ!!

దటీజ్‌ పింకీ!

నాన్న: నువ్వు సరిగా చదవకుంటే, నీ గురించి అమ్మకు చెబుతా..
పింకి: నాన్నా... నువ్వు నన్ను ఏమైనా అన్నావో.. నీ పేరే చెబుతా.. నీకు అమ్మ గురించి తెలుసుగా!

నాన్న: తెలుసు.. తెలుసు..! అమ్మో... వద్దు..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని