నవ్వుల్‌..నవ్వుల్‌..!

నాన్న: ఏంటి చింటూ..! పుస్తకంలో అదేపనిగా ఏదో దిద్దుతున్నావు. ఏంటది చూపించు? చింటు: ప్రోగ్రెస్‌ రిపోర్టు మీద మీ సంతకం కోసం.. ప్రతిసారీ మీ ముందు చేతులు కట్టుకొని నిల్చోవాల్సి వస్తోందిగా..

Published : 12 Dec 2021 00:41 IST

గట్టి ప్రయత్నమే!
నాన్న: ఏంటి చింటూ..! పుస్తకంలో అదేపనిగా ఏదో దిద్దుతున్నావు. ఏంటది చూపించు?
చింటు: ప్రోగ్రెస్‌ రిపోర్టు మీద మీ సంతకం కోసం.. ప్రతిసారీ మీ ముందు చేతులు కట్టుకొని నిల్చోవాల్సి వస్తోందిగా..
నాన్న: ఆ.. వస్తే...

చింటు:  నాకు ఇకపై ఆ దుస్థితి రాకుండా.. ఉండాలని మీ సంతకాన్ని ప్రాక్టీస్‌ చేస్తున్నా.
నాన్న: ఆఁ!!

ఓహో.. అదా కారణం!
టీచర్‌: పింకీ..! నువ్వు హోం వర్క్‌ ఎందుకు చేయలేదు.
పింకి: కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. అని నిన్న మీరే చెప్పారుగా టీచర్‌.
టీచర్‌:  అవును.. చెప్పాను. అయితే.. దానికి.. దీనికీ సంబంధం ఏంటి?

పింకి: చెట్టు కాయకుంటే రాళ్ల దెబ్బలుండవు. నేను హోం వర్క్‌ చేయకుంటే తప్పొప్పుల సమస్యే ఉండదుగా.. అందుకని..!
టీచర్‌:  ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని