నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఏంటి చింటూ.. గోడ మీద ఏదో వెతుకుతున్నావ్‌?...

Updated : 10 Mar 2022 02:27 IST

నాన్నే.. అలా అన్నారు మరి!
అమ్మ: ఏంటి చింటూ.. గోడ మీద ఏదో వెతుకుతున్నావ్‌?
చింటు: మొన్న నాన్న నీతో గోడకు చెవులుంటాయి అని చెప్పారుగా..
అమ్మ: అవును చెప్పారు.. అయితే..!
చింటు: అదే అమ్మా.. గోడకు చెవులు ఎక్కడ ఉన్నాయా.. అని వెతుకుతున్నా.
అమ్మ: ఆఁ!!

శిక్ష కాదు.. అది శిక్షణ!
అమ్మ: బంటీ.. తమ్ముణ్ని ఎందుకు కొట్టావ్‌?
బంటి: అది కొట్టడం కాదమ్మా..
అమ్మ: అంత గట్టిగా కొట్టి మళ్లీ కాదంటున్నావ్‌...
బంటి: అయ్యో.. అమ్మా... నేను కొట్టడం లేదమ్మా... కష్టాలు ఎదుర్కొనేలా తమ్ముడికి ఇప్పటి నుంచే ట్రైనింగ్‌ ఇస్తున్నా..
అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని