నవ్వుల్‌... నవ్వుల్‌...!

టీచర్‌: లిల్లీ..! కాకి ఏమని అరుస్తుంది?లిల్లి: అంటే ఎప్పుడు టీచర్‌?

Published : 11 May 2022 00:56 IST

దటీజ్‌ లిల్లీ!

టీచర్‌: లిల్లీ..! కాకి ఏమని అరుస్తుంది?
లిల్లి: అంటే ఎప్పుడు టీచర్‌?
టీచర్‌: ఎప్పుడు ఏంటి?
లిల్లి:: అంటే కోపంలో ఉన్నప్పుడా.. సంతోషంలో ఉన్నప్పుడా.. బాధలో ఉన్నప్పుడా.. టీచర్‌?
టీచర్‌: సందర్భాన్ని బట్టి అరుస్తుందా అది?
లిల్లి: అవును టీచర్‌.
టీచర్‌: ఏ సందర్భంలో ఎలా అరుస్తుందో నువ్వే చెప్పు లిల్లీ...
లిల్లి: కోపంలో ఉన్నప్పుడు ‘కావ్‌..కావ్‌..’ అని, సంతోషంలో ఉన్నప్పుడు ‘కావ్‌..కావ్‌..’ అని, బాధలో ఉన్నప్పుడు ‘కావ్‌..కావ్‌..’ అని అరుస్తుంది టీచర్‌.
టీచర్‌: అన్నిసార్లూ ‘కావ్‌..కావ్‌..’ అనే అరిచింది కదా!
లిల్లి: మనకు కాకి భాష రాదు కాబట్టి అరుపుల్లో తేడా అర్థం కాదు టీచర్‌. కానీ తోటి కాకులకు అర్థమవుతుంది.
టీచర్‌: దేవుడా!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని