Published : 25 May 2022 00:04 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

పాయింటే సుమీ!

తరుణ్‌: ఏంటి వరుణ్‌... అలా నీరసంగా ఉన్నావు.
వరుణ్‌: అన్నం తినలేదు తరుణ్‌.

తరుణ్‌: ఏ.. ఎందుకు?
వరుణ్‌: మా ఇంట్లో వంకాయ కూర. నాకు అది నచ్చదు.

తరుణ్‌: కూర నచ్చకుంటే.. కూర తినకు. అన్నం ఏం పాపం చేసింది. దాన్ని తినొచ్చు కదా!

వరుణ్‌: ఆఁ!!

ఇవన్నీ నేనే కనిపెట్టా...!

టీచర్‌: వెంకీ.. నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు?
వెంకి: సైంటిస్టు అవుతా టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. నువ్వు సైంటిస్టు అయితే ఏం కనిపెడతావు.
వెంకి: చాలా కనిపెడతా టీచర్‌. ఇప్పటికే నేను ఎన్నో కనిపెట్టాను తెలుసా?

టీచర్‌: అవునా.. అవి ఏంటో చెప్పు.
వెంకి: పాల నుంచి పెరుగు వస్తుంది.. కానీ పెరుగు నుంచి పాలు రావు. కుక్క తోకను ఊపుతుంది. కానీ తోక కుక్కను ఊపలేదు. నీళ్లు లేకుంటే చేపలు ఉండవు. కానీ చేపలు లేకున్నా నీళ్లుంటాయి. వేలికి ఉంగరం ఉంటుంది.. కానీ ఉంగరానికి వేలు ఉండదు. ఇంకా....

టీచర్‌: చాలు చాలు.. వెంకీ.. ఇక ఆపు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని