నవ్వుల్‌.. నవ్వుల్‌...!

పింకి: బంటీ.. ఈసారి టైంకే స్కూళ్లు తెరుస్తారంటావా?

Published : 06 Jun 2022 00:13 IST

తప్పదు మరి!

పింకి: బంటీ.. ఈసారి టైంకే స్కూళ్లు తెరుస్తారంటావా?
బంటి: ఏ.. నీకెందుకు ఆ అనుమానం వచ్చింది.
పింకి: మంకీపాక్స్‌ అని మళ్లీ ఏదో వైరస్‌ వచ్చిందటగా..
బంటి: అవును పింకీ.. కానీ మనం దాన్ని నమ్ముకోలేం..
పింకి: ఏ.. ఎందుకు?
బంటి: దానికి కరోనాకు ఉన్నంత స్పీడ్‌ లేదు.
పింకి: అంటే స్కూల్‌కు వెళ్లాల్సిందేనా...
బంటి: ఊ.. తప్పదు మరి!

అదే కదా!

అమ్మ : రిక్కీ.. ఇప్పుడే మార్కెట్లో మీ టీచర్‌ కలిశారు రా..
రిక్కి : ఏమన్నారమ్మా?
అమ్మ : పరీక్షలో నీ ముందు కూర్చున్న విక్కీ రాసిన సమాధానాలూ, నీవీ అక్షరం తేడా లేకుండా ఒకేలా ఉన్నాయట!!
రిక్కి : ఇది టూమచ్‌ అమ్మా.. ఇద్దరికీ ఒకటే క్వశ్చన్‌ పేపర్‌ కదా!!

మా నాన్నను చూసి...

టీచర్‌: చింటూ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?
చింటు: సన్యాసిగా మారిపోతా టీచర్‌.
టీచర్‌: అవునా.. ఎందుకు?
చింటు: అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో మా నాన్నగారి కష్టాలు చూశాక.. నాకు అదే బెటర్‌ అనిపిస్తోంది టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని