నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌.. సున్నాను కనుక్కొన్నది ఆర్యభట్ట. ఆయన పుట్టింది కలియుగంలో.. మరి అంతకంటే ముందే రావణుడికి పది తలలనీ, కౌరవులు వంద మంది అని.. ఎలా లెక్కించారు టీచర్‌!

Published : 19 Aug 2022 00:26 IST

పాయింటే సుమీ!

టింకు: టీచర్‌.. సున్నాను కనుక్కొన్నది ఆర్యభట్ట. ఆయన పుట్టింది కలియుగంలో.. మరి అంతకంటే ముందే రావణుడికి పది తలలనీ, కౌరవులు వంద మంది అని.. ఎలా లెక్కించారు టీచర్‌!
టీచర్‌: ఆఁ!!

అంతేగా... అంతేగా...!

టీచర్‌: బంటీ.. నువ్వు పెద్దయ్యాక జీవితంలో ఎలా స్థిరపడతావు?
బంటి: నేను స్థిరపడను టీచర్‌.
టీచర్‌: అదేంటి.. ఎందుకలా..
బంటి: నేను నది లాంటోణ్ని టీచర్‌. ఒకే దగ్గర స్థిరపడిపోవడం నాకు నచ్చదు.
టీచర్‌: ఆఁ!!

నిజమే మరి!

తాతయ్య: జీవితంలో ముళ్ల బాటలో పయనించాల్సి వచ్చినప్పుడు మనకు తోడు ఎవరుంటారు? బంధువులా? స్నేహితులా?. చెప్పు కిట్టూ?
కిట్టు: వీళ్లెవరూ కాదు తాతయ్యా!.
తాతయ్య: మరి?
కిట్టు: చెప్పులు తోడుంటాయి తాతయ్యా!  

నాన్న వద్దంటారు మరి!

టీచర్‌: రేపు సూర్యుడి మీద పాఠం ఉంటుంది. అందరూ తప్పకుండా రావాలి. సరేనా?
బిట్టు: నేను రాలేను టీచర్‌.
టీచర్‌: ఏ.. ఎందుకు?
బిట్టు: మా నాన్న నన్ను అంతదూరం పంపించరు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని