నవ్వుల్‌...! నవ్వుల్‌...!

చిన్ను : మిన్నూ.. మీ బామ్మ ఏంటీ.. టానిక్‌ తాగమంటే, అంతలా భయపడుతోంది?

Published : 30 Sep 2022 00:05 IST

పాయింటే మరి..

చిన్ను : మిన్నూ.. మీ బామ్మ ఏంటీ.. టానిక్‌ తాగమంటే, అంతలా భయపడుతోంది?
మిన్ను : మరేం లేదు చిన్నూ.. అది ఐరన్‌ టానిక్‌..

చిన్ను : ఆ.. అయితే?
మిన్ను : అది తాగితే, పేగులకు తుప్పు పడుతుందేమోనని భయపడుతోంది..

చిన్ను : ఆ..!!

దెబ్బకు దెబ్బ

అమ్మ : ఏరా చంటీ.. పరీక్ష ఎలా రాశావు?
చంటి : అన్నీ నాకు తెలియని ప్రశ్నలే అడిగారమ్మా..

అమ్మ : అవునా.. మరి నువ్వేం చేశావు?
చంటి : నేనేమైనా తక్కువా.. నేను కూడా వాళ్లకు తెలియని జవాబులు రాసి వచ్చా..

అది కూడా..

టీచర్‌ : రాకీ.. నీకు ఏ బుక్‌ అంటే ఇష్టం?
రాకీ : మా నాన్న చెక్‌బుక్‌ అంటే ఇష్టం టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని