నవ్వుల్‌...! నవ్వుల్‌...!

టీచర్‌: నిన్ను రెండు నిమిషాలు సీఎంను చేస్తే ఏం చేస్తావు?

Published : 03 Oct 2022 00:18 IST

అయ్య బాబోయ్‌!

టీచర్‌: నిన్ను రెండు నిమిషాలు సీఎంను చేస్తే ఏం చేస్తావు?
బంటి: మ్యాగీ చేస్తాను టీచర్‌.. రెండు నిమిషాల్లో  అంతకు మించి ఇంకా ఏం చేయగలం.!

టీచర్‌: సరే అయితే, అయిదు సంవత్సరాలు సీఎంను చేస్తే..?
బంటి: అన్ని సంవత్సరాలు మ్యాగీ చేయలేను టీచర్‌. ఎందుకంటే అంత మ్యాగీ ఎవరు తింటారు?

టీచర్‌: ఆఁ!!

అవునా.. నిజమా!

చింటు: నాన్నా.. నేను మా స్కూలు ముందు ధర్నా చేద్దామనుకుంటున్నా.
నాన్న: ఎందుకు?

చింటు: దసరా సెలవులు, దీపావళి సెలవుల్ని అనుసంధానం చేయాలని..
నాన్న: ఆఁ!!

దటీజ్‌ బిట్టూ!

బిట్టు: అమ్మా.. నాకో 50 రూపాయలివ్వు?
అమ్మ: ఎందుకు?

బిట్టు: రోడ్డు మీద నిల్చుని అరుస్తున్న పేదవాడికి ఇద్దామని.
అమ్మ: అవునా.. ఏమని అరుస్తున్నాడు.

బిట్టు: ఐస్‌క్రీం.. ఐస్‌క్రీం.. అని!
అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని