నవ్వుల్‌... నవ్వుల్‌..!

అమ్మ : ఏంటి హరీ.. క్యాలెండర్‌లో తెగ వెతికేస్తున్నావు?

Updated : 03 Jun 2023 04:36 IST

మేం ఒప్పుకోం..

అమ్మ : ఏంటి హరీ.. క్యాలెండర్‌లో తెగ వెతికేస్తున్నావు?

హరి : మరేం లేదమ్మా.. వేసవి సెలవులు అయిపోవస్తున్నాయి కదా.. మళ్లీ బడులు తెరుస్తారు..

అమ్మ : ఆ.. అయితే?

హరి : ఏదైనా సెలవు రోజు పండగొచ్చి.. మాకు అన్యాయం జరిగిందేమోనని క్యాలెండర్‌లో చెక్‌ చూస్తున్నా..

అమ్మ : ఆ..!!


భలే కనిపెట్టాడు..

విన్ని : బామ్మా బామ్మా.. ఇందాక అన్నం తింటుంటే నాకోటి తెలిసింది..

బామ్మ : అవునా.. ఏంటది?

విన్ని : పప్పుచారుకు పచ్చిపులుసు ముత్తాత వరస అనీ..

బామ్మ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని