నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఏంట్రా కిరణ్‌.. దిగాలుగా కూర్చున్నావు?

Updated : 27 Oct 2023 04:09 IST

నిజమే మరి..

మావయ్య : ఏంట్రా కిరణ్‌.. దిగాలుగా కూర్చున్నావు?

కిరణ్‌ : అవును మావయ్యా..

మావయ్య : ఏం జరిగిందో చెప్పు..?

కిరణ్‌ : అన్నయ్య కంటే ముందు నేనే పుట్టాల్సింది..

మావయ్య : ఇప్పుడేమైంది?

కిరణ్‌ : అన్నయ్యకు చిన్నవైన చొక్కాలు, నిక్కర్లే నాకు కొత్త దుస్తులవుతున్నాయి మావయ్యా..

మావయ్య : ఆ..!!


భలే భలే..

టీచర్‌ : లతా.. దసరా సెలవుల్లో ఏం నేర్చుకున్నావు?

లత : అల్లరి చేయడం నేర్చుకున్నా టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


అంతే అంటావా?

మధు : అక్కా అక్కా.. ఎంతైనా చలికాలం గ్రేట్‌ కదూ!

సింధు : ఎందుకలా?

మధు : పెద్దా చిన్నా అనే తేడా లేకుండా అందరి ఒళ్లూ పగలగొడుతుంది కాబట్టి..

సింధు : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని