నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 03 Nov 2023 00:03 IST

నీకు తెలుసా..?

చింటు: నేనో ప్రశ్న అడుగుతాను.. సమాధానం చెబుతావా చంటీ..!
చంటి: అడుగు చింటూ..
చింటు: ‘చైనా వాల్‌’ని ప్రపంచ వింత అని ఎందుకు అంటారో తెలుసా..!
చంటి: తెలుసు చింటూ.. వాళ్లు తయారుచేసిన వాటిల్లో ఎక్కువ రోజుల నుంచి ఉన్నది అదే కదా..!
చింటు: ఆఁ..!


నువ్వే దాక్కో..!

బంటి: నువ్వు ఈరోజు స్కూల్‌కి ఎందుకు వెళ్లలేదు కిట్టూ..?
కిట్టు: హోంవర్క్‌ చేయలేదు అన్నయ్యా..
బంటి: అయితే వెంటనే వెళ్లి దాక్కో.. మీ టీచర్‌ ఇటువైపే వస్తున్నారు..
కిట్టు: ముందు నువ్వే వెళ్లి దాక్కో అన్నయ్యా..
బంటి: నేనెందుకు?
కిట్టు: నా హోంవర్క్‌ బుక్‌ను నువ్వే చింపేశావని చెప్పా..
బంటి: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని