నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్నా.. రేపు స్కూల్లో చిన్న   ‘గెట్‌ టుగెదర్‌’ ఉంది.. మీరు తప్పకుండా రావాలి..!

Updated : 18 Nov 2023 03:43 IST

తప్పకుండా రావాలి..!

చంటి: నాన్నా.. రేపు స్కూల్లో చిన్న   ‘గెట్‌ టుగెదర్‌’ ఉంది.. మీరు తప్పకుండా రావాలి..!

నాన్న: చిన్నదంటే.. ఎవరెవరు వస్తున్నారు చంటీ..?

చంటి: మీరు, నేను, మా ప్రిన్సిపల్‌ సర్‌.. అంతే నాన్నా..!

అదే ఆలోచిస్తున్నా..!

కిట్టు: బంటీ.. ఏంటి ఆ గోడవైపు అలానే చూస్తున్నావు?

బంటి: మరేం లేదు కిట్టూ.. ‘అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి’ అని రాసి ఉంది కదా..!  

కిట్టు: అవును.. అయితే ఏంటి?

బంటి: మరి పరీక్షలు మాత్రం.. ఎవరిది వాళ్లే సొంతంగా ఎందుకు రాయాలంటారు?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని