నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చంటీ.. ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు? మరేం లేదు కిట్టూ.. అసలు పరీక్షలు ఎందుకు పెడతారా అని..!

Published : 07 Dec 2023 00:37 IST

అందుకే..!

కిట్టు: చంటీ.. ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు?

చంటి: మరేం లేదు కిట్టూ.. అసలు పరీక్షలు ఎందుకు పెడతారా అని..!

కిట్టు: ఏముంది.. ఎంత మంది ఫెయిల్‌ అవుతారో తెలుసుకోవడానికి..!

ఎప్పటిలాగే..!

చింటు: ఈరోజు పేపర్‌ ఎలా ఉంది బన్నీ..?

బన్ని: ఎప్పటిలాగే తెల్లగా ఉంది చింటూ..!

చింటు: అయ్యో.. అలా కాదు ప్రశ్నలు ఎలా వచ్చాయని అడుగుతున్నా..

బన్ని: అలాగా.. ప్రతిసారి వచ్చినట్టే పది ప్రశ్నలు వచ్చాయి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని