నవ్వుల్‌..నవ్వుల్‌..!

అదే ఆలోచిస్తున్నా..!  కిట్టు: చంటీ.. ఏమైంది ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు?  చంటి: మరేం లేదు కిట్టూ.. రేపు నాకు రక్తపరీక్ష ఉంది..

Published : 09 Dec 2023 01:05 IST

అదే ఆలోచిస్తున్నా..!

 కిట్టు: చంటీ.. ఏమైంది ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు?

 చంటి: మరేం లేదు కిట్టూ.. రేపు నాకు రక్తపరీక్ష ఉంది..
కిట్టు: అయితే..?
చంటి: ఆ పరీక్ష అయినా పాసవుతానో లేదో అని ఆలోచిస్తున్నా..!

అందుకే మరి..!

టీచర్‌: బిట్టూ.. నువ్వు ప్రతిరోజూ హోంవర్క్‌ చేయకుండా వస్తున్నావేంటి?
బిట్టు: నేను హాస్టల్లో ఉంటాను టీచర్‌..!

టీచర్‌: ఉంటే..
బిట్టు: ఎక్కడ చేయాల్సిన పని అక్కడే చేయాలని మీరే చెప్పారు కదా టీచర్‌.. అప్పుడు ‘హోం’వర్క్‌ హాస్టల్లో ఎలా చేయను..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని