...అది ప్రభువు సేవే!

ఇద్దరు మిత్రులు ఏసు జన్మస్థలమైన బెత్లహాం బయల్దేరారు. దారిలో వారికి ఓ యాత్రికుడు కూడా తారసపడ్డాడు. ముగ్గురూ కలిసి ప్రయాణం సాగించారు. మార్గంమధ్యలో యాత్రికుడు జబ్బుపడ్డాడు....

Published : 23 Apr 2020 01:02 IST

క్రీస్తువాణి

ఇద్దరు మిత్రులు ఏసు జన్మస్థలమైన బెత్లహాం బయల్దేరారు. దారిలో వారికి ఓ యాత్రికుడు కూడా తారసపడ్డాడు. ముగ్గురూ కలిసి ప్రయాణం సాగించారు. మార్గంమధ్యలో యాత్రికుడు జబ్బుపడ్డాడు. ఆ ఇద్దరు మిత్రుల్లో ఒకడు ఆ యాత్రికుకికి సేవచేస్తూ ఉండిపోతే ఇంకో మిత్రుడు ఆ ఇద్దరినీ వదిలి బెత్లహాంకు సాగిపోయాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తనకంటే ముందు చేరిన మిత్రుడిని ఏసు ప్రభువు తన హృదయానికి హత్తుకుంటున్న దృశ్యం కనిపించింది. అంతరార్థం బోధపడింది. తాను చేసిన తప్పిదం అవగతమైంది.
‘నేను ఆకలిగా ఉన్నాను... మీరు నాకు భోజనం పెట్టారు. దాహం వేసింది... నీళ్లిచ్చారు. నేను పరదేశినైనా నన్ను మీలో ఒకడిగా చేర్చుకున్నారు...’ అన్నాడు ప్రభువు ఒకరోజు తన శిష్యులతో. అయ్యో ప్రభూ... ఇవన్నీ మేమెప్పుడు మీకు ఇచ్చాం... ఆయన శిష్యులు అయోమయంగా ప్రశ్నించారు. అప్పుడు ప్రభువు ఇలా అన్నారు... ‘అవన్నీ మీరు మీ సోదరులకిచ్చారు. స్నేహితులకిచ్చారు. ఆపదలో ఉన్నవారికిచ్చారు. కాబట్టి అది నాకు చేసిన సేవే’...
తోటి మనిషికి సేవ చేస్తే ప్రభువు సేవేనని ఆయన చాటిచెప్పారు.

- ఎం.సుగుణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని