కాయలు కాయని చెట్టు

జీవితం వృథాగా సాగకూడదు, సార్థకం చేసుకోవాలంటూ ఒక ఉదాహరణ చెప్పారు క్రీస్తు ప్రభువు.. ‘ఒక రైతు వేసిన ద్రాక్షతోటలో అంజీర చెట్టు కూడా ఉంది. ఒకరోజు రైతు అంజీర పండ్ల కోసం చూశాడు. చెట్టు

Updated : 06 Jan 2022 06:29 IST

జీవితం వృథాగా సాగకూడదు, సార్థకం చేసుకోవాలంటూ ఒక ఉదాహరణ చెప్పారు క్రీస్తు ప్రభువు.. ‘ఒక రైతు వేసిన ద్రాక్షతోటలో అంజీర చెట్టు కూడా ఉంది. ఒకరోజు రైతు అంజీర పండ్ల కోసం చూశాడు. చెట్టు పచ్చగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఒక్క పండూ లేదు. దాంతో విసుగుచెందిన రైతు తోటమాలిని పిలిచి, మూడేళ్లుగా చూస్తున్నా.. ఒక్క కాయా కాయడంలేదు. దీన్ని నరికెయ్యి! భూసారం ఎందుకు వ్యర్థం కావాలి?’ అన్నాడు కోపంగా. తోటమాలి పచ్చనిచెట్టును నరకడమెందుకని, ‘కొంచెం ఓపిక పట్టండయ్యా! ఈ ఏడాది కూడా వేచి చూద్దాం. ఫలిస్తే సరి, లేకుంటే అప్పుడు నరకొచ్చు’ అంటూ నచ్చజెప్పాడు.

‘తోటమాలి చెప్పినదానికి రైతు అంగీకరించాడు. దేవుడు కూడా మన తప్పులను సహిస్తాడు. నిర్లక్ష్య వైఖరిని వదలాలని ఓపిగ్గా ఎదురు చూస్తాడు. ఉత్తమంగా జీవించడమే మనిషి లక్ష్యం కావాలి. పచ్చగా ఉన్న పండ్ల చెట్టు కాయలు కాయకపోతే ఉపయోగం ఏముంది?’ అంటూ వివరించారు ప్రభువు. నలుగురికీ ఉపయోగపడని జీవితం వ్యర్థమన్నది క్రీస్తు భావన.

- కొలికపూడి రూఫస్


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు