కట్టుబడి.. బడ్జెట్‌కు లోబడి

ఇంటి నిర్మాణ వ్యయం పెరుగుతూ వస్తోంది. స్టీలు, సిమెంట్‌, ఇసుక, ఇటుక, ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌ వరకు ముడిసరుకుల ధరలు పెరిగాయి. మధ్యలో కొన్నిటి ధరలు తగ్గినా అది స్వల్పకాలమే.

Published : 24 Jun 2023 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ఇంటి నిర్మాణ వ్యయం పెరుగుతూ వస్తోంది. స్టీలు, సిమెంట్‌, ఇసుక, ఇటుక, ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌ వరకు ముడిసరుకుల ధరలు పెరిగాయి. మధ్యలో కొన్నిటి ధరలు తగ్గినా అది స్వల్పకాలమే. మరోవస్తువు ధర పెరుగుదలతో సంతోషం ఆవిరవుతోంది. ప్రస్తుతం కొంతకాలంగా నిలకడగానే ఉన్నాయి. అయినా బడ్జెట్‌ కంటే ఎక్కువే అవుతోంది. హెచ్చుతగ్గుల ప్రభావం భారంగా కాకుండా బడ్జెట్‌లోనే ఇల్లు కట్టుకోవాలంటే డిజైన్‌ దశ నుంచే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఇంజినీర్లు.

  • ఇల్లు కట్టుకోవాలనుకుంటే సొంతంగా దగ్గరుండి కట్టించుకుంటారా? గుత్తేదారుకు అప్పగిస్తారా? అనేది ముందే తేల్చుకోవాలి. మీకు సమయం ఉంటే ఇంజినీరు పర్యవేక్షణలో స్వయంగా కట్టుకోవచ్చు. ఈ శ్రమంతా పడలేను అనుకునేవాళ్లు గుత్తేదారుకు అప్పగించడం మేలు.  
  • కుటుంబ సభ్యులందరూ చర్చించుకున్న తర్వాతే ఇంటిప్లాన్‌ను అర్కిటెక్ట్‌తో గీయించుకోండి. పక్కా ప్రణాళికతోఉంటే ఖర్చు ఆదా అవుతుంది.  
  • నాణ్యమైన సామగ్రిని ఎంచుకోండి. పలుచోట్ల ఆరాతీసిన తర్వాతే కొనుగోలు చేయాలి. బేరమాడడానికి సిగ్గుపడితే జేబుకు చిల్లు పడినట్లే.  
  • ఇంటి నిర్మాణంలో సామగ్రి వృథా తగ్గిస్తే వ్యయం తగ్గుతుంది.
  • ఇల్లు దగ్గరుండి కట్టించుకున్నా ఇంజినీర్‌ పర్యవేక్షణ తప్పనిసరి. ప్లాన్‌ గీసి ఇచ్చినప్పుడే ఎంత ఖర్చవుతుంది? సిమెంట్‌, స్టీల్‌, ఇటుక ఎంత అవసరమనే వివరాలు ఇస్తారు. ఆ మేరకే కొనుగోలు చేయాలి. లేకపోతే మిగిలిపోయిన సామగ్రిని ఏం చేసుకోలేం.  
  • పునాదుల నుంచి ఇంటీరియర్‌ వరకు ఏడాదిలోపే అయ్యేలా చూసుకోవాలి. గడువు లోపు పూర్తిచేసి గృహప్రవేశం చేస్తే ఖర్చు కలిసొస్తుంది.
  • ప్రస్తుతం ఇంటి నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.1500 నుంచి రూ.2వేల వరకు అవుతోంది.నిర్మాణ స్థలం, అంతస్తులు, ఉపయోగించే సామగ్రి, మేస్త్రీ, కూలీల ధరలను బట్టి ఇందులో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రణాళికతో వ్యవహరిస్తే రూ.50 లక్షల ఇంటికి రూ.5లక్షల దాకా ఆదా చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని