గుమ్మడి ఇడ్లీలు..!

కావాల్సినవి: గుమ్మడికాయ గుజ్జు- రెండు కప్పులు, పచ్చికొబ్బరి తురుము- కప్పు, బియ్యం రవ్వ- కప్పు, నూనె- కొద్దిగా, యాలకుల పొడి- చిటికెడు, ఉప్పు- కొద్దిగా, నీళ్లు- సరిపడా....

Published : 16 Feb 2020 00:36 IST

పాఠక వంట

కావాల్సినవి: గుమ్మడికాయ గుజ్జు- రెండు కప్పులు, పచ్చికొబ్బరి తురుము- కప్పు, బియ్యం రవ్వ- కప్పు, నూనె- కొద్దిగా, యాలకుల పొడి- చిటికెడు, ఉప్పు- కొద్దిగా, నీళ్లు- సరిపడా.
తయారీ: బియ్యం రవ్వలో కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. రవ్వ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే ఉండాలి. తొక్క తీసిన గుమ్మడికాయ ముక్కలను కుక్కర్‌లో వేసి నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకూ ఉడికించి, మెత్తగా మెదపాలి. దీంట్లో బియ్యం రవ్వ, సరిపడా ఉప్పు, యాలకుల పొడి, కొంచెం నీళ్లు వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని ప్లేట్‌లకు కొద్దిగా నూనె రాసి ఇడ్లీలు వేయాలి. మధ్యస్థంగా ఉన్న మంట మీద అరగంటపాటు ఉడికించాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌చేసి అలాగే పది నిమిషాలపాటు ఉంచేయాలి. కాస్త చల్లారాక స్పూన్‌తో తీసుకోవాలి. కొబ్బరిచట్నీతో తింటే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి.

 

సీహెచ్‌.ఉష శ్రీకాకుళం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని