ఇట్టే కీమా చేసేస్తుంది!

ఫొటోలో కనిపిస్తున్న సుత్తి లాంటి పరికరం పేరు ‘మీట్‌ టెండరైజర్‌’. ఇది మాంసాహార ప్రియులకు చాలా బాగా నచ్చుతుంది. దీని సాయంతో చికెన్‌, మటన్‌లను మెత్తగా చేసేయొచ్చు. అంతేనా...

Published : 21 Nov 2021 00:33 IST

ఫొటోలో కనిపిస్తున్న సుత్తి లాంటి పరికరం పేరు ‘మీట్‌ టెండరైజర్‌’. ఇది మాంసాహార ప్రియులకు చాలా బాగా నచ్చుతుంది. దీని సాయంతో చికెన్‌, మటన్‌లను మెత్తగా చేసేయొచ్చు. అంతేనా... ఐస్‌, బెల్లం, డ్రైఫ్రూట్స్‌, క్యాండీ లాంటి గట్టి పదార్థాలను కూడా నుజ్జునుజ్జు చేసుకోవచ్చు. అల్లంవెల్లుల్లిని దంచుకోవచ్చు. ఈ పరికరానికి రెండు వైపులా ఉండే మొనదేలిన ముళ్లలాంటి భాగాలు పదార్థాలను సులువుగా విరగొట్టేస్తాయి.  శుభ్రం చేయడం కూడా తేలికే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని