మాచెర్‌ డిమెర్‌ బొర

చేపలతో వేపుడు, ఇగురు, పులుసు చెయ్యడం అందరికీ తెలిసిందే. కానీ చేపల గుడ్లతోనూ ఒక వెరైటీ వంటకం చేయొచ్చు. అదే ఈ మాచెర్‌ డిమెర్‌ బొర. చేప గుడ్లతో చేసిన వడ అని దీనర్థం.   ఈ బెంగాలీ వంటకాన్ని సాయంత్రం పూట వేడివేడిగా తింటే ఆ రుచే వేరు. తయారీ కూడా సులువే....

Published : 07 Apr 2019 00:48 IST

పొరుగింటి పుల్లకూర: బెంగాలీ వంటకం

చేపలతో వేపుడు, ఇగురు, పులుసు చెయ్యడం అందరికీ తెలిసిందే. కానీ చేపల గుడ్లతోనూ ఒక వెరైటీ వంటకం చేయొచ్చు. అదే ఈ మాచెర్‌ డిమెర్‌ బొర. చేప గుడ్లతో చేసిన వడ అని దీనర్థం.   ఈ బెంగాలీ వంటకాన్ని సాయంత్రం పూట వేడివేడిగా తింటే ఆ రుచే వేరు. తయారీ కూడా సులువే.
కావాల్సిన పదార్థాలు:
చేప గుడ్లు(చెన)- కప్పు, సెనగపిండి- రెండు కప్పులు, ఉల్లిపాయముక్కలు- మూడుచెంచాలు, పచ్చిమిర్చి- నాలుగు, కొత్తిమీర- చిన్నకట్ట, గసగసాలు- 100 గ్రాములు, ఉప్పు- తగినంత, నూనె: తగినంత
తయారీ విధానం: ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, గసగసాలను మెత్తగా పేస్టులా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ పేస్ట్‌, ఉల్లిపాయముక్కలు కలిపి సెనగపిండిలో వేసి కలపాలి. ఇప్పుడు చేప చెనలో తగినంత ఉప్పు కలిపి సెనగపిండి మిశ్రమంలో వేసి కొద్ది కొద్దిగా నీళ్లుపోస్తూ కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇలాచేస్తే చెన పిండిలో పూర్తిగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడల్లా వత్తుకుని నూనెలో వేయించి తీయాలి. ఒక్కసారికి నాలుగు వడల వరకూ వేయించుకోవచ్చు. వీటిని సాయంత్రం సమయాల్లో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.

- లక్ష్మి నరుకుల

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని