చిక్కుడు పచ్చడి చేద్దామా!

చిక్కుడు కాయలతో వేపుడు, కూర మాత్రమే కాదు... పచ్చడీ చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగానూ ఉంటుంది. అంతేకాదు వారం, పదిరోజులు నిల్వ కూడా ఉంటుంది.  

Updated : 27 Mar 2022 06:04 IST

చిక్కుడు కాయలతో వేపుడు, కూర మాత్రమే కాదు... పచ్చడీ చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగానూ ఉంటుంది. అంతేకాదు వారం, పదిరోజులు నిల్వ కూడా ఉంటుంది.  

కావాల్సినవి: ముదిరిన చిక్కుడు కాయలు- పావుకిలో, నూనె- రెండు కప్పులు, కారం- కప్పు, ఉప్పు- రెండు చెంచాలు, చింతపండు గుజ్జు- అర కప్పు, ఆవపిండి- పెద్ద చెంచా, వెల్లుల్లి రెబ్బలు- పావు కప్పు.

తయారీ: శుభ్రం చేసిన చిక్కుడు కాయలను తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి కప్పు నూనె వేసి వేడయ్యాక చిక్కుడు కాయలను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో కారం, ఉప్పు, చింతపండు గుజ్జు, ఆవపిండి, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. వేయించిన చిక్కుడు కాయలను ఇందులో వేసి బాగా కలపాలి. మిగిలిన నూనె కాస్త వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక ఇందులో కలపాలి. మూడు రోజుల తర్వాత పచ్చడి ఊరుతుంది. అంతే చిక్కుడు కాయల పచ్చడి రెడీ. దీన్ని పది రోజులపాటు నిల్వ చేసుకోవచ్చు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని