మీ పోపుల పెట్టెలో..ఇవి ఉన్నాయా?

వర్షాకాలం కదా! చీటికీ మాటికీ జలుబు, తలనొప్పి వంటివి వేధించడం సహజం. అలాంటప్పుడు ఉపశమనం కోసం మీ పోపుల పెట్టెలో ముఖ్యమైన ఈ ఐదు సుగంధ దినుసులు ఉన్నాయో లేవో చూసుకోండి

Updated : 03 Jul 2022 05:44 IST

వర్షాకాలం కదా! చీటికీ మాటికీ జలుబు, తలనొప్పి వంటివి వేధించడం సహజం. అలాంటప్పుడు ఉపశమనం కోసం మీ పోపుల పెట్టెలో ముఖ్యమైన ఈ ఐదు సుగంధ దినుసులు ఉన్నాయో లేవో చూసుకోండి. తక్కిన దేశాలతో పోలిస్తే కొవిడ్‌ ప్రభావం మనపై తక్కువగా ఉండటానికి సుగంధ ద్రవ్యాల వాడకమే కారణమని తాజా అధ్యయనాలు కూడా తేల్చాయి మరి...

మిరియాలు: కిచిడీ, చారు, కూరల్లో కారానికి బదులుగా మిరియాలని వాడి చూడండి. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడవేయడం వంటి సమస్యలు దరిచేరవు. 

అల్లం: ఈకాలంలో వైరస్‌ కారణంగా తలెత్తే అనేక సమస్యలకు అల్లం చెక్‌ పెడుతుంది. చలి జ్వరం, వికారం వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

నిమ్మగడ్డి: దీన్నే ఫీవర్‌ గ్రాస్‌ అని కూడా పిలుస్తారు. కారణం... ఈకాలంలో వచ్చే జ్వరాలని నిమ్మగడ్డి సమర్థంగా నియంత్రిస్తుంది. దీంతో చేసిన టీని తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

పసుపు: శరీరం లోపల అంతర్గత వాపులు రానీయకుండా చేస్తుంది. ఈ కాలంలో తరచూ వేధించే మలేరియా, గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు కలిపిన పాలు అనేక అనారోగ్య చిక్కులకు ఔషధంలా పనిచేస్తాయి. 

వెల్లుల్లి: ఈ సమయంలో వ్యాధినిరోధకశక్తిని పెంచి మనల్ని జబ్బుల బారిన పడకుండా చేసే సూపర్‌ఫుడ్‌ ఏదైనా ఉందంటే అది వెల్లుల్లే. పచ్చళ్లు, సూపులు, కూరల్లో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచిది. దీనిలో యాంటీ ఫంగల్‌ గుణాలు అధికంగా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని