గింజలు తీస్తాయి..పొట్టు వలుస్తాయి

వంటింట్లో... కొన్ని పనులు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. నిజానికి వంటకన్నా ఇవే ఎక్కువ సమయం తీసుకుంటాయి. వెల్లుల్లిపై పొట్టు వలవాలంటే... చాలా శ్రమ పడాలి. పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌లలో గింజలు తీయడం ఇలాంటి పనే. ఇలా మన సహనానికి పరీక్ష పెట్టే పనులని తేలిగ్గా పూర్తిచేయడానికి తయారుచేసిన పరికరాలే ఇవన్నీ..

Published : 09 Oct 2022 00:04 IST

వంటింట్లో... కొన్ని పనులు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. నిజానికి వంటకన్నా ఇవే ఎక్కువ సమయం తీసుకుంటాయి. వెల్లుల్లిపై పొట్టు వలవాలంటే... చాలా శ్రమ పడాలి. పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌లలో గింజలు తీయడం ఇలాంటి పనే. ఇలా మన సహనానికి పరీక్ష పెట్టే పనులని తేలిగ్గా పూర్తిచేయడానికి తయారుచేసిన పరికరాలే ఇవన్నీ..

గార్లిక్‌ పీలింగ్‌ మెషీన్‌.. పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలని వేస్తే క్షణాల్లో వలిచి పెట్టేస్తుంది.

యాపిల్‌లోని గింజల్ని తొలగించే కోర్‌ రిమూవర్‌

గుమ్మడి, పుచ్చకాయ విత్తనాల్ని వలిచే ఎలక్ట్రానిక్‌ పరికరం. పై నుంచి కాసిని గింజలు వేస్తే చక్కగా వలిచి పెట్టేస్తుంది.

స్టఫ్డ్‌ మిర్చీ, స్టఫ్డ్‌ క్యాప్సికమ్‌ వంటి వంటకాలు వండేటప్పుడు వాటిల్లోని గింజల్ని తీయడం కష్టమనిపిస్తే ఈ సీడ్‌ పికర్‌ని దగ్గర పెట్టుకుంటే చాలు. ఒకేసారి వాటిల్లోని గింజల్ని తీసి పక్కన పెట్టేయొచ్చు.

పైనాపిల్‌ రుచి అమోఘంగా ఉంటుంది కానీ దానిలోని ముళ్లే.. ఎంత తీసినా నాలుకకి తగిలి దురదగా అనిపిస్తాయి. అదే మీ చేతిలో ఈ పరికరం ఉంటే ముళ్లని తొలగించడం తేలిక.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని