అప్పటికప్పుడు వేడిగా...

చలి మొదలయిపోయింది. ఎంత వేడిగా వండి వడ్డిద్దామనుకున్నా భోజనాల బల్లమీద కూర్చునే సరికి వంటకాలన్నీ చల్లారిపోతుంటాయి.

Published : 30 Oct 2022 00:15 IST

లి మొదలయిపోయింది. ఎంత వేడిగా వండి వడ్డిద్దామనుకున్నా భోజనాల బల్లమీద కూర్చునే సరికి వంటకాలన్నీ చల్లారిపోతుంటాయి. తిరిగి వాటిని వేడిచేయాలంటే వేరే పాత్రలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. మళ్లీ వాటన్నింటినీ తోముకోవాలి. ఇంత పనిలేకుండా... మీరే సమయంలో నైనా వేడిగా తినాలనుకుంటే ఈ గ్రేవీ వార్మర్‌ మీ దగ్గర ఉంటే చాలు. చూడ్డానికి చక్కని సెరామిక్‌ బౌల్‌లా ఉంది కదా! అదే దీని ప్రత్యేకత. వండిన వంటలని ఈ బౌల్‌కి తీసుకుంటే చాలు. దీనికి అడుగున కరెంట్‌తో పనిచేసే ఒక బేస్‌ ఉంటుంది. దానికి కాసేపు ఛార్జింగ్‌ పెట్టి తీసేస్తే చాలు. ఈ బేస్‌పై వార్మర్‌ని ఉంచితే గంటపాటు వంటకాలు వేడిగా ఉంటాయి. డైనింగ్‌ టేబుల్‌పై తక్కువ స్థలంలో అందంగా అమరిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని