సగ్గుబియ్యం, పెసరపప్పులా కలిసి ఉండాలని..

గ్జూ గ్జీ కేక్‌.. పేరు వింతగా ఉంది కదా!  ఇది వియత్నాంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన వంటకం. దీనికి భార్యాభర్తల కేకు అని ఇంకో పేరు కూడా ఉంది.

Updated : 14 May 2023 00:36 IST

గ్జూ గ్జీ కేక్‌.. పేరు వింతగా ఉంది కదా!  ఇది వియత్నాంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన వంటకం. దీనికి భార్యాభర్తల కేకు అని ఇంకో పేరు కూడా ఉంది. వియత్నాం వాసులు వివాహ వేడుకలో ఈ కేకు తప్పనిసరిగా ఉండాల్సిందే. కర్రపెండ్లం జిగురు, పెసరపప్పు వాడి చేసే ఈ కేకు చాలా జిగురుగా ఉంటుంది. అది ఎంత జిగురుగా  ఉంటే వారి బంధం కూడా అంతే గట్టిగా ఉంటుందని నమ్ముతారు అక్కడి ప్రజలు. మన జీలకర్ర, బెల్లం మాదిరిగా అన్నమాట. పెసలు, సగ్గుబియ్యం, నువ్వులు, మొక్కజొన్న పిండి, కొబ్బరి, పంచదారతో చేస్తారు. వీటిని అరటి ఆకుల్లో పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. వియత్నా పెళ్లిళ్లలో ఈ కేకులకు చాలా ప్రాధాన్యం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు