స్ట్రీట్‌ ఫుడ్‌ ఇంటికొచ్చేస్తుంది..

మన నాలుక మహా భోగ లాలసండీ బాబూ! రోజూ తినే కూరా చారూ, ఇడ్లీ, చపాతీలతో సరిపెట్టుకోదు. దానికెప్పుడూ కమ్మకమ్మటి కొత్తకొత్త రుచులు కావాలి. అలాంటి ఘుమఘుమలేవో ఆస్వాదించాలంటే హోటళ్లే శరణ్యం.

Published : 16 Jul 2023 00:19 IST

అదీ సంగతి

మన నాలుక మహా భోగ లాలసండీ బాబూ! రోజూ తినే కూరా చారూ, ఇడ్లీ, చపాతీలతో సరిపెట్టుకోదు. దానికెప్పుడూ కమ్మకమ్మటి కొత్తకొత్త రుచులు కావాలి. అలాంటి ఘుమఘుమలేవో ఆస్వాదించాలంటే హోటళ్లే శరణ్యం. ఒకప్పుడంటే అందుకోసం బయటకు వెళ్లాల్సొచ్చేది. ఇప్పుడో మీట నొక్కితే చాలు ఏది కావాలంటే అది ‘జీ హుజూర్‌’ అంటూ కాసేపట్లో మనముందుకు వచ్చేస్తుంది. అంతకంటే వెసులుబాటు ఎక్కడ ఏది పసందుగా ఉంటుందో, దేనికెన్ని స్టార్స్‌ ఇచ్చారో.. చూసుకుని మరీ ఆర్డరివ్వొచ్చు. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్‌ డెలివరీ కంపెనీలు పేరున్న హోటళ్ల నుంచే కాదు.. చిన్న చిన్న ఫలహారశాలల నుంచి కూడా తెచ్చిపెడతాయి. ఇటీవల చేసిన సర్వే ప్రకారం 9000 మందికి పైగా స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్లు ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ ద్వారా వివిధ పదార్థాలను డెలివరీ చేస్తున్నారు. త్వరలో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని