వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు తెలుసా..

ఇంట్లో అదనంగా ఉన్న పదార్థాలన్నీ ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అలా అయితే పాడవకుండా తాజాగా ఉంటాయనేది ఒక కారణమైతే, బయట ఉంటే పురుగు చేరదనేది రెండో కారణం.

Updated : 23 Jul 2023 02:16 IST

ఇంట్లో అదనంగా ఉన్న పదార్థాలన్నీ ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అలా అయితే పాడవకుండా తాజాగా ఉంటాయనేది ఒక కారణమైతే, బయట ఉంటే పురుగు చేరదనేది రెండో కారణం. కానీ కొన్నిటిని ఫ్రిజ్‌లో పెట్టనేకూడదు. వాటిల్లో యాపిల్‌, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, బంగాళాదుంపలు, కమలాపండ్లు, ద్రాక్ష, బెర్రీపండ్లు, పుచ్చకాయ, తేనె, వెన్న, కాఫీపొడి, టొమాటోలు, కీరాదోస, ఆలివ్‌నూనె, కరివేపాకు, పసుపు, టొమాటో కెచప్‌, సోయా సాస్‌, పీనట్‌ బటర్‌, బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్‌ ముఖ్యమైనవి. వీటికి రిఫ్రిజిరేటర్‌ ఉపయోగించడం మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే మనం చపాతీలు, పూరీల కోసం కలిపిన గోధుమ పిండి మిగిలితే ఇంకోరోజు చేసుకోవచ్చని ఫ్రిజ్‌లో పెడుతుంటాం. కానీ అలా పెట్టిన పిండికి సూక్ష్మక్రిములు చేరతాయని నిపుణులు చెబుతు న్నారు. కనుక అవసరమైనంత పిండే కలుపుకోవడం ఉత్తమం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని