సాధనం ఒక్కటే.. ప్రయోజనాలెన్నో!

వంట చేయడం కంటే కూరగాయల చెక్కు తీయడం, ముక్కలుగా తరగడమే కష్టమనిపిస్తుంది కదూ.. ఆ శ్రమను తగ్గించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరికరాలను రూపొందిస్తున్నారు

Updated : 23 Jul 2023 02:06 IST

వంట చేయడం కంటే కూరగాయల చెక్కు తీయడం, ముక్కలుగా తరగడమే కష్టమనిపిస్తుంది కదూ.. ఆ శ్రమను తగ్గించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరికరాలను రూపొందిస్తున్నారు. పండ్లు, కూరగాయల చెక్కు తీసేందుకు అనేక ఆకృతుల్లో పీలర్లు ఉంటాయి. అవి మనకేం కొత్త కాదు. కానీ చెక్కు తీస్తూనే పుచ్చును లేదా ఎండినట్లున్న భాగాన్ని తీసేయడం.. మట్టి, పొట్టు లాంటివుంటే తొలగించడం.. ముక్కలు కోయడం.. చిప్స్‌కు అనుకూలంగా పొడుగ్గా, గుండ్రంగా తరగడం.. ఇలా అనేక విధాల పనికొచ్చే మల్టీ ఫంక్షనల్‌ పీలర్లు మనకు అందుబాటు లోకి వచ్చాయి. పీలర్‌తోబాటు బ్రష్షు, బ్లేడ్సు ఉన్న ఈ సాధనం నచ్చితే మీరూ కొనేసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని