నూనె సీసాలో కుంచె

దోశలు, చపాతీలకు గరిటెతో నూనె వేస్తుంటే ఎక్కువ పడుతుంటుంది కదూ! అదేమో ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకు పరిష్కారంగా వచ్చిందే నూనె సీసాలో కుంచె. బ్రష్‌ను నూనెలో ముంచి ప్యాన్‌ మీద రాస్తే సరిపోతుంది.

Published : 30 Jul 2023 00:36 IST

దోశలు, చపాతీలకు గరిటెతో నూనె వేస్తుంటే ఎక్కువ పడుతుంటుంది కదూ! అదేమో ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకు పరిష్కారంగా వచ్చిందే నూనె సీసాలో కుంచె. బ్రష్‌ను నూనెలో ముంచి ప్యాన్‌ మీద రాస్తే సరిపోతుంది. ఎక్కువ నూనె పడదు. సీసాలోనే ఉంటుంది కనుక అవసరమైనప్పుడల్లా కడిగి, తడి లేకుండా తుడవాల్సిన అవసరం లేదు. సిలికాన్‌తో తయారైంది కనుక పర్యావరణ హితం కూడా. ఈ సీసాను నూనెకే కాదండోయ్‌.. తేనె, సాస్‌ తదితరాలకూ వినియోగించవచ్చు. బ్రెడ్డు మీద జామ్‌ లేదా కెచప్‌ను ఈ కుంచెతో సమంగా పరిచినట్లు చేయొచ్చు. నచ్చితే మీరూ కొనుక్కోండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని