ఉబకాయాన్ని నివారించే యోగర్ట్‌

అనేక వంటల్లో యోగర్ట్‌ ఉపయోగిస్తుంటాం. ఇంతకీ యోగర్ట్‌ రుచికి మాత్రమేనా అంటే కాదు.. ఇది మంచి పోషకాహారం.

Updated : 06 Aug 2023 01:20 IST

నేక వంటల్లో యోగర్ట్‌ ఉపయోగిస్తుంటాం. ఇంతకీ యోగర్ట్‌ రుచికి మాత్రమేనా అంటే కాదు.. ఇది మంచి పోషకాహారం. ఇందులో క్యాల్షియం, విటమిన్లు, రైబోఫ్లావిన్‌, భాస్వరం, మెగ్నీషియం, పొటాషియం విస్తారంగా ఉన్నాయి. ఆరోగ్యనిపుణులు దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్‌ అంటారు. యోగర్ట్‌లో ఎన్ని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో చూడండి.. రక్తంలో చెక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతుంది. అరుచి, ఆకలి మందగించడం లాంటి సమస్యలను నివారిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం, డయేరియా, మలబద్ధకం లాంటి సమస్యలను నివారిస్తుంది. ఊబకాయం రానివ్వదు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున వాపు, దద్దుర్లు లాంటివి తగ్గిస్తుంది. హైబీపీ రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉన్న మంచి కొలెస్ట్రాల్‌ గుండెజబ్బులను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది కనుక జలుబు, జ్వరం లాంటి సాధారణ అనారోగ్యాలు దరిచేరవు. యోగర్ట్‌లో మంచి ప్రొటీన్లు ఉన్నందున తీసుకున్నది సరిపోయినట్లవుతుంది. ఇంకా తినాలనే తృష్ణ ఉండదు. దాంతో బరువు తగిన స్థాయిలో నిలకడగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని