డిప్రెషన్‌ను తగ్గిస్తుంది...

కొన్ని పదార్థాల్లో ఆలివ్‌ నూనెనే ఉపయోగించమంటారు ఆహార నిపుణులు. కానీ ఇతర నూనెల కంటే ధర ఎక్కువ కనుక కొందరు సంకోచిస్తారు

Published : 13 Aug 2023 01:10 IST

కొన్ని పదార్థాల్లో ఆలివ్‌ నూనెనే ఉపయోగించమంటారు ఆహార నిపుణులు. కానీ ఇతర నూనెల కంటే ధర ఎక్కువ కనుక కొందరు సంకోచిస్తారు. ఇంతకీ ఈ నూనె ఎందుకు మంచిదో, దీని ప్రత్యేకత ఏమిటో చూద్దాం.. విటమిన్లు, ఖనిజాలు ఉన్న పోషకాహారమిది. ఇందులో గుండెకు మేలు చేసే కొవ్వు ఉంది. ‘అత్యంత ఆరోగ్య కొవ్వు’గా దీన్ని వర్ణిస్తారు. ఈ నూనె ఉపయోగించేవారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది. సాధారణ నూనెకు బదులు ఆలివ్‌ నూనె ఉపయోగించే వారిలో గుండె జబ్బులు చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. మధుమేహాన్ని నివారిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. దీనికి చేపనూనె జతచేస్తే సత్వర ప్రయోజనం ఉంటుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. మచ్చలను, మొటిమలను పోగొడుతుంది, ముడతలు పడకుండా కాపాడుతుంది. కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. ఇందులోని ఇ-విటమిన్‌ రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. కళ్ల కింద వలయాలు ఏర్పడనివ్వదు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఊబకాయం రాదు. ఇది యాంగ్జయిటీ, డిప్రెషన్లను కూడా తగ్గిస్తుంది. ఆలివ్‌ నూనె అల్జీమర్స్‌, కాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతుందని చెబుతున్న శాస్త్రవేత్తలు ఈ అంశమై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని