కురుల ఆరోగ్యానికి మెంతి

ఇతర ఆకుకూరలతో పోలిస్తే మెంతికూర కొంచెం తక్కువే వినియోగిస్తాం కదూ! నిజానికి ఇది చాలా శ్రేష్ఠమైంది. ఇందులో ఎ,సి,ఇ విటమిన్లు, కెరోటిన్‌, క్యాల్షియం, ఐరన్‌, సోడియం, కాపర్‌, మెగ్నీషియం, జింక్‌, పొటాషియం, సెలేనియం, మాంగనీస్‌, ప్రొటీన్లు విస్తారంగా ఉన్నాయి.

Published : 27 Aug 2023 01:05 IST

ఇతర ఆకుకూరలతో పోలిస్తే మెంతికూర కొంచెం తక్కువే వినియోగిస్తాం కదూ! నిజానికి ఇది చాలా శ్రేష్ఠమైంది. ఇందులో ఎ,సి,ఇ విటమిన్లు, కెరోటిన్‌, క్యాల్షియం, ఐరన్‌, సోడియం, కాపర్‌, మెగ్నీషియం, జింక్‌, పొటాషియం, సెలేనియం, మాంగనీస్‌, ప్రొటీన్లు విస్తారంగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్‌ స్థాయి సమంగా ఉంటుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. ఉబ్బసం, కడుపుబ్బరం తగ్గుతాయి. యాంటీఆక్సిడెంట్లు విస్తారంగా ఉన్నందున వ్యాధినిరోధకంగా పనిచేస్తుంది. ఇందులోని కె విటమిన్‌ దంతాలు, ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది. మెదడులోని న్యూరాన్లు నాశనం కావనీ, అల్జీమర్స్‌, క్యాన్సర్‌లను తగ్గించడంలోనూ తోడ్పడుతుందనీ ఇటీవలి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలడం, చుండ్రు లాంటి సమస్యలు తలెత్తవు. కాలేయం, మూత్రపిండాలకు మంచిది. బాలింతలకు పాలు పడతాయి. మెంతికూరలోని పీచు జీర్ణప్రక్రియను మెరుగుపరిస్తే.. ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణీలకు మేలు చేస్తుంది. ఇది రక్తహీనత, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. తక్కువ కెలొరీలు ఉన్నందున ఊబకాయం రాదు, లావైపోతామన్న బెంగ అవసరం లేదు. ఇది కూరల్లోనే కాదు సలాడ్స్‌, సూప్స్‌లోనూ బాగుంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న మెంతిని తరచూ తిని ఆరోగ్యంగా ఉందాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు