ప్లేటులో ఉల్లిపువ్వు!

ముంబై లోని కరేలిబాగ్‌ ప్రాంతంలో... ఒక స్ట్రీట్‌ వెండర్‌- ఆలూ బోండా, మసాలా వడ లాంటి పాత చిరుతిళ్లే ఎందుకు.. కొత్తగా ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు.

Published : 27 Aug 2023 00:58 IST

ముంబై లోని కరేలిబాగ్‌ ప్రాంతంలో... ఒక స్ట్రీట్‌ వెండర్‌- ఆలూ బోండా, మసాలా వడ లాంటి పాత చిరుతిళ్లే ఎందుకు.. కొత్తగా ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు. ఇకనేం.. వేడివేడిగా ఉల్లిపూలు వడ్డిస్తున్నాడు. ప్లేట్లలో పువ్వులు వికసించి కనువిందు చేస్తోంటే.. తిన్నవారి ముఖాలు కూడా తామర పువ్వు ల్లా విప్పారుతున్నా యి. సమోసా లూ, మిర్చి బజ్జీల గురించి తెలుసు కానీ ఈ ఉల్లిపువ్వులేంటి అనుకుంటున్నారా? అదే మరి తమాషా. ‘ఆనియన్‌ బ్లాసమ్‌ మేకర్‌’తో ఒక్కో ఉల్లిపాయ పుష్పంలా తయారైతే.. దాన్ని బజ్జీపిండిలో ముంచి, మసాలాపొడి దట్టించి నూనెలో వేయగానే.. అవి క్షణాల్లో వేగిపోయి ప్లేటుల్లో నోరూరిస్తున్నాయి. ఈ వర్షా కాలంలో మహా పసందుగా ఉన్నాయంటూ రుచి చూసిన వాళ్లు కితాబులిస్తున్నారు. ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్‌ది గుజరాత్‌. ఇతడి ఉల్లిపూలు నచ్చడంతో జనం రద్దీ పెరిగింది. ఈ వంటకాన్ని ఒక ఫుడ్‌ వ్లాగర్‌ ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేయగా.. లక్షలాది వ్యూసు, లైక్సు, కామెంట్లు వచ్చాయి. ముంబై వెళ్తే మీరూ వీటిని తిని ఆస్వాదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు