శుభ్రంగా కడిగేస్తుంది

ముల్లంగి, క్యారెట్‌ లాంటి దుంపలను ఎన్ని నీళ్లతో ఎంతగా కడిగినా.. కంటికి కనిపించని సన్నటి మట్టి, ఇసుక రేణువులు మిగిలే ఉంటాయి. పోనీ.. పీల్‌ చేద్దామంటే.. అలా చెక్కు తీయడంలో పోషకాలు తరిగిపోతాయి.

Updated : 03 Sep 2023 05:05 IST

ముల్లంగి, క్యారెట్‌ లాంటి దుంపలను ఎన్ని నీళ్లతో ఎంతగా కడిగినా.. కంటికి కనిపించని సన్నటి మట్టి, ఇసుక రేణువులు మిగిలే ఉంటాయి. పోనీ.. పీల్‌ చేద్దామంటే.. అలా చెక్కు తీయడంలో పోషకాలు తరిగిపోతాయి. దీనికి పరిష్కారంగా ‘వెజిటబుల్‌ ఈజీ క్లీనింగ్‌ బ్రష్‌’ వచ్చింది. గరుకుగా ఉన్న ఈ బ్రష్షుతో రుద్ది కడిగితే ఒక్క దుమ్ము కణం కూడా లేకుండా దుంపలు, కూరగాయలు పరిశుభ్రమవుతాయి. ఇక పీలర్‌తో అవసరమే ఉండదు. కూరగాయలకే కాకుండా పాత్రలను పట్టు జారకుండా పట్టుకోవడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు