బాదం తిందాం.. ఆరోగ్యంగా ఉందాం..
మాంగనీస్, మెగ్నీషియం, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్లతో బాదంపప్పు మంచి పోషకాహారం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉన్నాయి.
మాంగనీస్, మెగ్నీషియం, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్లతో బాదంపప్పు మంచి పోషకాహారం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం సాధారణంగా వచ్చే అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే రోజూ ఐదారు బాదం గింజలు తినడం అలవాటు చేసుకోవాలి. చర్మం ముడతలు పడదు, మెరుపు, మృదుత్వం వస్తాయి.కంటి కింద వలయాలు నయమవుతాయి. దాంతో వయసు మీదపడినట్లు అనిపించదు. గుండె జబ్బులనే కాక.. క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి భయానక వ్యాధులనూ నిరోధిస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. జీర్ణ వ్యవస్థ సవ్యంగా ఉంటుంది. జీవ ప్రక్రియ బాగుంటుంది. టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తపోటును నివారిస్తుంది. ఇందులో ఉన్న పోషకాల వల్ల త్వరగా ఆకలి వేయదు. కొన్నే తిన్నా దండిగా ఉన్నట్లుంటుంది. అలా అధిక ఆహారం తీసుకోం కనుక.. ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునేవారు బాదం తీసుకోవడం మంచిది. మెదడు చురుగ్గా ఉంటుంది. ఎనీమియా రాదు. నరాలకు మంచిది. కురులు దృఢంగా ఉంటాయి. పులిపిరి కాయలు తగ్గుతాయి. మన వయసు, ఆరోగ్యం, శరీర తత్వాలను బట్టి రోజుకు మూడు గింజల నుంచి 12 వరకూ తినొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ సైనికులను పంపే ప్రణాళికలు లేవని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పష్టం చేశారు.
-
Ghulam Nabi Azad: తదుపరి ‘ఎల్జీ’ అంటూ ప్రచారం.. గులాం నబీ ఆజాద్ ఏమన్నారంటే!
-
Uttar Pradesh : నాపై కక్షతో చేతబడి చేశారు.. యూపీ ఎమ్మెల్యే పోస్టు వైరల్
-
Meenakshi Chaudhary: మరో స్టార్హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?
-
Congress: అజయ్ మాకెన్‌కు కీలక పదవి!
-
Supriya Sule: ఆ రెండు పార్టీల చీలిక వెనక.. భాజపా హస్తం: సుప్రియా