డిన్నర్‌ అదిరిందన్న అనుష్క శర్మ

‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అనే నానుడికి సరిగ్గా సరిపోతారు అనుష్క శర్మ, విరాట్‌కోహ్లీలు. ఆ జంటను చూసి ముచ్చటపడని వాళ్లుండరు.

Published : 01 Oct 2023 00:21 IST

‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అనే నానుడికి సరిగ్గా సరిపోతారు అనుష్క శర్మ, విరాట్‌కోహ్లీలు. ఆ జంటను చూసి ముచ్చటపడని వాళ్లుండరు. ఇద్దరి ఆదర్శాలూ, అభిరుచులూ ఒకటవడమే అందుక్కారణం. ఇద్దరూ భోజనప్రియులే, శాకాహారులే. వాటికి సంబంధించి తరచూ ఇంట్రస్టింగ్‌ పోస్టులు పెడుతుంటుంది అనుష్క. తాను మహా ఫుడ్‌ లవర్‌నని, కొన్ని కొన్ని పదార్థాలు చూస్తేనే నోరూరిపోతుందని చెబుతుంటుంది. ఆమె మాంసాహారం తినకపోవడమే కాకుండా.. సందర్భం వచ్చినప్పుడల్లా శాకాహారం ఎంత మంచిదో చాటుతుంటుంది. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, నిరంతరం ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ.. ఇంట్లో చేసినవే తింటుంది. ఇటీవల ఒక స్నేహితురాలు అనుష్కను రాత్రి భోజనానికి పిలిచింది. బిర్యానీలు, రోస్టెడ్‌ స్టఫ్‌కు బదులు.. కాలీదాల్‌తో (మినప్పప్పు) తయారుచేసే కేరళ సబ్జీ, కాకరకాయ కూర వడ్డించింది.. వాటిని చూసి మురిసిపోయిన అనుష్క- చక్కటి శాకాహారమంటూ ఆమెకి కృతజ్ఞతలు చెప్పింది. సూపర్‌ రుచి అంటూ ప్రశంసలు కురిపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు