కస్సుమన్న కచోరీ వెండర్‌

మనం ఎప్పటికప్పుడు కొత్త రుచుల కోసం వెతుకుతుంటాం. అందుకే ఫుడ్‌ వీడియోలకు డిమాండ్‌ పెరిగింది. వీధికో ఫుడ్‌వ్లాగర్‌ పుట్టుకొచ్చి.. బోలెడన్ని చిరుతిళ్ల సమాచారం అందిస్తున్నారు.

Published : 08 Oct 2023 00:28 IST

నం ఎప్పటికప్పుడు కొత్త రుచుల కోసం వెతుకుతుంటాం. అందుకే ఫుడ్‌ వీడియోలకు డిమాండ్‌ పెరిగింది. వీధికో ఫుడ్‌వ్లాగర్‌ పుట్టుకొచ్చి.. బోలెడన్ని చిరుతిళ్ల సమాచారం అందిస్తున్నారు. వాటితో ఆకట్టుకోవడంతో పాటు అపహాస్యం పాలయ్యే సందర్భాలూ ఉంటాయి. కోల్‌కతాకు చెందిన ఫుడ్‌ వ్లాగర్‌ ఓ కచోరీ వెండర్‌ నుంచి కొత్త విషయాలు రాబట్టాలనుకున్నాడు. అతణ్ణి మాటల్లోకి దింపేందుకు.. ‘ఇవన్నీ నువ్వే చేస్తావా?’ అన్నాడు. ఇలాంటి వీడియోలతో స్ట్రీట్‌ వెండర్స్‌ ఉన్నట్టుండి ఫేమస్‌ అయిపోతారన్న యావ లేకపోగా.. కాగే నూనెలో నీళ్లచుక్కలు పడ్డట్టు చిరాకుపడి.. ‘నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? కంప్యూటర్‌ లోంచి వస్తాయా? వండటం నుంచి అమ్మడం వరకూ అన్నీ నేనే చేస్తాను. నీకెన్ని కచోరీలు కావాలో చెప్పు.. అంతేగానీ.. ఇలా అసందర్భ ప్రశ్నలడిగితే నేను వ్యాపారం చేసుకోవాలా వద్దా?’ అంటూ కస్సుమన్నాడు. బిక్కచచ్చిపోయాడు వ్లాగర్‌. అవమానించేయడం అయ్యాక చివర్లో- తనకు తీరికున్నప్పుడు మాట్లాడతానంటూ ఔదార్యం చూపాడు. ఈ వీడియో వైరలై.. సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని