నూనె మరకలు మాయమిక!

వంట చేయడం కంటే పొయ్యి గట్టు, వంటింటి గోడలను శుభ్రం చేసుకోవడం చాలా కష్టం. జిడ్డు పేరుకుపోయి ఒక పట్టాన వదలవు.

Published : 29 Oct 2023 00:50 IST

వంట చేయడం కంటే పొయ్యి గట్టు, వంటింటి గోడలను శుభ్రం చేసుకోవడం చాలా కష్టం. జిడ్డు పేరుకుపోయి ఒక పట్టాన వదలవు. ఈ బాధ నుంచి బయటపడేస్తుంది వాటర్‌, ఆయిల్‌ ప్రూఫ్‌ వాల్‌ పేపర్‌. చమురు పట్టే ప్రాంతాల్లో ఈ షీట్‌ను అంటిస్తే సరి.. గోడలూ, గట్టూ ఎంచక్కా నీట్‌గా ఉంటాయి. భోజనాల బల్ల మీద కూడా అతికించవచ్చు. నీటిని పీల్చుకోదు, దుమ్ము, తేమల బాధ ఉండదు. ఈ షీట్‌ను అంటించడం, తుడవటం, తీసేయడం- అన్నీ తేలికే. ఇది పల్చగా ఉంటుంది కనుక అతుకు పెట్టినట్లు కూడా ఉండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని