కూరలు కడగొచ్చు, తరగొచ్చు, భద్రం చేయొచ్చు..

కూరగాయలు కనుక తరిగి సిద్ధంగా ఉంటే.. కూర వండటం చాలా సులువు. ఈ తరుగుడు కార్యక్రమమే కొంచెం కష్టమైన వ్యవహారం.

Published : 05 Nov 2023 00:36 IST

కూరగాయలు కనుక తరిగి సిద్ధంగా ఉంటే.. కూర వండటం చాలా సులువు. ఈ తరుగుడు కార్యక్రమమే కొంచెం కష్టమైన వ్యవహారం. ఈమధ్య కాలంలో అధునాతన పరికరాలు వచ్చి.. ఆ పనులను సునాయాసం చేస్తున్నాయి. వాటిల్లో ‘మల్టీ ఫంక్షన్‌ ఫోల్డింగ్‌ ఛాపింగ్‌ బోర్డ్‌’ ఒకటి. ఇది కనుక ఉంటే కూరగాయ ముక్కలు చెదిరి పక్కన పడతాయేమో అనే భయం లేకుండా చకచకా తరిగేయొచ్చు. కింద ఉన్న బాస్కెట్‌ కూరగాయలను శుభ్రం చేయడానికీ, తరిగిన ముక్కలు వేయడానికీ కూడా ఉపయోగపడుతుంది. పనవ్వగానే మడిచే వీలూ ఉన్నందున.. ఎక్కువ స్థలం ఆక్రమించదు. దళసరిగా ఉన్న ఈ సాధనం ఎక్కువ కాలం మన్నుతుంది. తరిగే పని లేదంటే పంచదార లాంటివి ఇందులో నిల్వ చేసుకోవచ్చు. ఈ మల్టీ ఫంక్షన్‌ ఫోల్డింగ్‌ ఛాపింగ్‌ బోర్డ్‌ కడగటమూ, ఆరబెట్టడమూ కూడా సులువే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని