ఆకుకూరలో గంజి.. అద్భుత రుచి..

ఆకుకూరల్లో రాణీ లాంటిది బచ్చలి. ఇది ఏ కాలంలోనైనా దొరుకుతుంది కనుక ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. మనం పప్పు, టొమాటోలతో కలిపి చేస్తే.. వేరే వేరే రాష్ట్రాల్లో వేరేవేరే విధాల్లో వండుతారు.

Published : 05 Nov 2023 00:36 IST

కుకూరల్లో రాణీ లాంటిది బచ్చలి. ఇది ఏ కాలంలోనైనా దొరుకుతుంది కనుక ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. మనం పప్పు, టొమాటోలతో కలిపి చేస్తే.. వేరే వేరే రాష్ట్రాల్లో వేరేవేరే విధాల్లో వండుతారు. ఉత్తరాఖండ్‌ వాసులు ‘కాఫులీ’ పేరుతో చేస్తారు. పేరు బాగుంది కదూ! రుచీ సూపరే. ఎలా చేస్తారంటే.. కడాయిలో రెండు చెంచాల నూనె వేసి.. వేడయ్యాక.. ఆవాలు, ఎండు మిర్చి, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి వేయాలి. ఆవాలు చిటపటలాడాక.. ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, బచ్చలికూర పేస్టు వేయాలి. కాస్త వేగాక.. రెండు చెంచాల నెయ్యి వేయాలి. కాస్త వేయించి.. రెండు చెంచాల గంజి పోయాలి. దగ్గరగా అయ్యాక.. తగినంత కారం, ఉప్పు వేసి.. ఇంకో నిమిషం ఉంచి దించేయాలి. అందులో అర కప్పు మీగడ వేస్తే.. ఘుమఘుమలాడే ‘కాఫులీ’ సిద్ధమై పోతుంది. ఇది అన్నం, రొట్టెలు.. ఎందులోకైనా బాగుంటుంది. ఇదెంతో ఆరోగ్యకరమైన వంటకం అంటారు ఆహార నిపుణులు. రుచీ, ఆరోగ్యం రెండూ కావాలంటే ఇలాంటివి తింటుండాలి. పైగా చేయడం కూడా చాలా తేలిక. నచ్చితే మీరూ చేసి చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని