పదార్థాలు పాడవకుండా...

తీరిక లేని జీవితంలో ఏరోజు కారోజు వెళ్లి.. తాజా కూరగాయలు కొనుక్కోవడం కొంచెం కష్టమైన సంగతి. అందుకు బదులుగా కవర్లలో పెట్టి ఫ్రిజ్‌లో భద్రం చేయడం మామూలే.

Published : 19 Nov 2023 00:44 IST

తీరిక లేని జీవితంలో ఏరోజు కారోజు వెళ్లి.. తాజా కూరగాయలు కొనుక్కోవడం కొంచెం కష్టమైన సంగతి. అందుకు బదులుగా కవర్లలో పెట్టి ఫ్రిజ్‌లో భద్రం చేయడం మామూలే. మరి అవి వారం పదిరోజుల వరకూ తాజాగానే ఉండాలంటే.. సిలికాన్‌ వెజిటబుల్‌ ఫుడ్‌ స్టోరేజ్‌ బ్యాగ్స్‌ వాడితే సరి. ఈ జిప్‌ లాక్‌ కవర్లు గాలి చొరబడనివ్వవు, మందంగా ఉంటాయి. సీల్‌ వేసినట్టుగా ఉండి.. కాయలు, పండ్లను మరింత తాజాగా ఉంచుతాయి. నాణ్యమైన మెటీరియల్‌తో చేయడం వల్ల మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కపక్కన నిలబెట్టొచ్చు. ఈ స్టోరేజ్‌ కంటెయినర్‌ ఫ్రీజర్‌ సంచుల్లో లంచ్‌తో సహా చిరుతిళ్లు, పానీయాలను కూడా భద్రం చేసేయొచ్చు. వీటిల్లో ఉంచిన పదార్థాల్ని మరో పాత్రలోకి తీయకుండా.. తిన్నగా కవర్‌తోనే అవెన్‌లో వేడిచేయొచ్చు. ఫ్రిజ్‌లో ఎక్కువ స్థలం ఆక్రమించదు, డిష్‌వాషర్‌తో శుభ్రం చేయడమూ తేలికే. నాణ్యమైన సిలికాన్‌ కనుక పదార్థాల రుచి తగ్గదు, విషతుల్యం కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని