బామ్మగారి కూల్‌ కుకింగ్‌

ఎనబయ్యేళ్లు వచ్చాయంటే తినే ఆసక్తే ఉండదు చాలామందిలో. సహించదు, అరగదు.. అంటూ ఏవో సాకులు చెబుతారు. ఇక వంట చేయాలంటే మరీ కష్టం. నీరసం ముంచుకొస్తుంది. కానీ 85 ఏళ్ల విజయ్‌ నిశ్చల్‌ ఆడుతూపాడుతూ వంట చేస్తోంటే చూసేవాళ్లక్కూడా హుషారు వస్తుంది. ఆవిడ చేసే వంటలు ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు.

Published : 03 Dec 2023 00:05 IST

 

నబయ్యేళ్లు వచ్చాయంటే తినే ఆసక్తే ఉండదు చాలామందిలో. సహించదు, అరగదు.. అంటూ ఏవో సాకులు చెబుతారు. ఇక వంట చేయాలంటే మరీ కష్టం. నీరసం ముంచుకొస్తుంది. కానీ 85 ఏళ్ల విజయ్‌ నిశ్చల్‌ ఆడుతూపాడుతూ వంట చేస్తోంటే చూసేవాళ్లక్కూడా హుషారు వస్తుంది. ఆవిడ చేసే వంటలు ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. మనవడి సలహాతో ఈ వయసులో ‘దాదీ కీ రసోయీ’ పేరుతో వంటల ఛానల్‌ మొదలుపెట్టింది. కొన్ని రోజుల్లోనే ఇన్‌స్టాలో ఈ బామ్మకు ఎనిమిదిన్నర లక్షల మంది ఫాలోవర్లు వచ్చేశారు. త్వరలోనే ఈ సంఖ్య రెట్టింపైనా ఆశ్చర్యం లేదు. ఈ దాదీ ప్రత్యేకత ఏమిటంటే.. ఎక్కడా నీరసం కనిపించదు. దేన్నీ సాగదీయదు. కొన్ని క్షణాల్లోనే ఓ వంటకాన్ని చేసేస్తుంది. ఇంత వేగంగా రెసిపీలు నేర్పించేస్తుంటే.. ఎవరికైనా నచ్చకేం చేస్తాయి?! తాజాగా దాదీ చేసిన ‘ఎగ్‌లెస్‌ కేక్‌’ సోషల్‌ మీడియాలో తెగ వైరలై.. ఫుడీలను ఆకట్టుకుంటోంది. రస్కులు, పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, ఉప్పు, బేకింగ్‌సోడా, బోర్నవిటాలను గ్రైండ్‌ చేసి.. ఆవిరి మీద ఉడికించింది. అంతే.. ఎగ్‌లెస్‌ కేక్‌ తయారైపోయింది. నచ్చితే ఈ బామ్మగార్ని మీరూ ఫాలో అయిపోండి. సామాన్యంగా అందరూ అమ్మల దగ్గర వంట నేర్చుకుంటారు. కానీ ఆమె మాత్రం తండ్రి దగ్గర వంట నేర్చుకున్నానని చెబుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని