వంకాయల్లాంటి ద్రాక్ష!

ద్రాక్షపళ్లను ఇష్టపడనివాళ్లు దాదాపుగా ఉండరు. అలాగే తిన్నా, రసం చేసుకుని తాగినా.. కస్టర్డ్‌లో వేసుకున్నా ఆహా అనిపిస్తుంది. మనందరికీ తెలిసిన ద్రాక్షపళ్లు చిన్నగా అంగుళం సైజులో.. కొన్నిసార్లు అంతకంటే చిన్నగా ఉంటాయి. కానీ ‘మూన్‌ డ్రాప్‌ గ్రేప్స్‌’ మాత్రం పెద్దగా, పొడుగ్గా ఉంటాయి. గబుక్కున చూస్తే వంకాయల్లా ఉంటాయి. వీటిల్లో ఆకుపచ్చ రకమూ ఉంది.

Published : 03 Dec 2023 00:08 IST

ద్రాక్షపళ్లను ఇష్టపడనివాళ్లు దాదాపుగా ఉండరు. అలాగే తిన్నా, రసం చేసుకుని తాగినా.. కస్టర్డ్‌లో వేసుకున్నా ఆహా అనిపిస్తుంది. మనందరికీ తెలిసిన ద్రాక్షపళ్లు చిన్నగా అంగుళం సైజులో.. కొన్నిసార్లు అంతకంటే చిన్నగా ఉంటాయి. కానీ ‘మూన్‌ డ్రాప్‌ గ్రేప్స్‌’ మాత్రం పెద్దగా, పొడుగ్గా ఉంటాయి. గబుక్కున చూస్తే వంకాయల్లా ఉంటాయి. వీటిల్లో ఆకుపచ్చ రకమూ ఉంది. దాన్ని ‘టేర్‌ డ్రాప్‌’ పేరుతో పిలుస్తారు. వీటిని క్యాలిఫోర్నియాలోని గ్రేప్‌ బ్రీడింగ్‌ కంపెనీ రూపొందించింది. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే లభ్యం అవుతున్నాయి. ఇది సాధారణ ద్రాక్షపళ్లకు మల్లేనే గుత్తులు గుత్తులుగా కాస్తాయి. వాసన కూడా అంతే. కానీ మరింత తియ్యగా ఉంటాయి. అందుకే వీటిని ‘స్వీట్‌ సెఫైర్‌’ (తియ్యటి నీలమణి) అంటారు. వీటితో జ్యూస్‌ చేసేట్లయితే ఎక్కువ నీüË™్ల కలపాల్సివస్తుంది. ఈ మూన్‌ డ్రాప్‌ వెరైటీ పండును సగం తింటేనే ఎక్కువైపోతుంది. మనింట్లోనూ ఓ మొక్క పెంచుకుంటే బాగుంటుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని