జల్లెడతో పని లేదిక!

ఏదైనా పిండి లేదా రవ్వను ఎక్కువ మొత్తంలో జల్లెడపట్టా లంటే.. చేతులు నొప్పెడతాయి. ఇకపై అలా శ్రమించకుండా సునాయాసంగా పని చేసేందుకు ‘ఫ్లోర్‌ సిఫ్టర్‌’ వచ్చేసింది.

Published : 10 Dec 2023 00:09 IST

దైనా పిండి లేదా రవ్వను ఎక్కువ మొత్తంలో జల్లెడపట్టా లంటే.. చేతులు నొప్పెడతాయి. ఇకపై అలా శ్రమించకుండా సునాయాసంగా పని చేసేందుకు ‘ఫ్లోర్‌ సిఫ్టర్‌’ వచ్చేసింది. ఇది మీట నొక్కితే చాలు.. జల్లెడ పట్టేస్తుంది. సౌఖ్యంగా పట్టుకునేందుకు అనుకూలమైన హ్యాండిల్‌ ఉంది. స్టెయిన్‌లెస్‌ స్టీలుతో రూపొందిన ఈ పరికరం తుప్పుపట్టదు. ఇందులో రెండు జల్లెడలు అమర్చి ఉండటాన పిండి లేదా పంచదార తేలిగ్గా కిందికి దిగుతాయి. నచ్చితే మీరూ ఒకటి కొనుక్కోండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని