నవాబుల దర్పానికి సంకేతం ఈ పాన్‌

విందు భోజనం అయ్యాక ఒక పాన్‌ నోట్లో వేసుకుంటే ఆ మజానే వేరు. నోటికెంతో హితవుగా ఉండటమే కాదు, భుక్తాయాసం లేకుండా తిన్నది చక్కగా అరుగుతుంది కూడా.

Published : 10 Dec 2023 00:11 IST

విందు భోజనం అయ్యాక ఒక పాన్‌ నోట్లో వేసుకుంటే ఆ మజానే వేరు. నోటికెంతో హితవుగా ఉండటమే కాదు, భుక్తాయాసం లేకుండా తిన్నది చక్కగా అరుగుతుంది కూడా. మామూలు పాన్‌ లేదా కిళ్లీ గురించే అంత గొప్పగా చెబుతుంటే.. ఇక 24 క్యారట్ల ‘గోల్డ్‌ ప్లేటెడ్‌ పాన్‌’ ఘనతను వర్ణించడానికి మాటలు సరిపోతాయా? అవును.. ఇందులో ఎలాంటి అతిశయం లేదు. అలాంటి పాన్‌ నిజంగానే ఉంది. లోపల వెండి, బయట బంగారు తొడుగు, కుంకుమపువ్వు టాపింగ్‌తో కనిపించే ఈ ప్రత్యేక పాన్‌ను మాస్టర్‌ సంజయ్‌ కుమార్‌ చౌరాసియా రూపొందించారు. ‘నవాబుల నగరం’గా ప్రసిద్ధమైన లఖ్‌నవూలో పెళ్లిళ్లకు భోజనం సప్లయ్‌ చేస్తారు సంజయ్‌. కరోనా సమయంలో వ్యాపారం కుంటుపడటంతో కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాడతను. ఆ ఆలోచనలోంచి వచ్చిందే గోల్డ్‌పాన్‌. అదిప్పుడు అమోఘమైన రుచీ, పరిమళాలతో ఎప్పుడెప్పుడు తిందామా అని ఉవ్విళ్లూరేలా చేస్తోంది.

ఈ గోల్డ్‌ పాన్‌ చూపులకు రాజసంగా ఉండటమే కాదు.. రుచీ, ఘుమాయింపులతో అదరగొడుతూ నవాబుల దర్పానికి సంకేతంగా నిలుస్తోంది. దీని ఖరీదు  రూ.999 మాత్రమేనండోయ్‌!

లఖ్‌నవూ నేషనల్‌ పాన్‌ దర్బార్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆరంభమైన ఈ గోల్డ్‌ ప్లేటెడ్‌ పాన్‌ గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఘనంగా చెబుతున్నారు. ఈ ఖరీదైన పాన్‌తోబాటు నవరత్న పాన్‌, హాఫ్‌ స్వీట్‌ పాన్‌- లాంటి రకాలు ఇక్కడ అలరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ పాన్‌ ప్రభావంతో దిల్లీ కన్నాట్‌ ప్లేస్‌లోనూ గోల్డ్‌ పాన్‌ రూపొందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని