చైనా.. కాఫీకి ఫిదా

ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీ తాగితే.. ఇక ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. పాలు రావడం ఆలస్యమై- కాఫీ కడుపులో పడలేదంటే.. ఏదో వెలితిగా ఉంటుంది. అంత ఇష్టమైన కాఫీని రోజులో రెండు మూడుసార్లయినా సేవిస్తాం

Published : 17 Dec 2023 00:43 IST

ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీ తాగితే.. ఇక ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. పాలు రావడం ఆలస్యమై- కాఫీ కడుపులో పడలేదంటే.. ఏదో వెలితిగా ఉంటుంది. అంత ఇష్టమైన కాఫీని రోజులో రెండు మూడుసార్లయినా సేవిస్తాం. అసలా పేరు చెబితే చాలు ప్రాణం లేచొస్తుంది. కమ్మటి రుచీ, పరిమళం దాని సొంతం మరి. మనం మాత్రమే కాదండోయ్‌.. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులున్నారు. అందుకే స్టార్‌బక్స్‌లో కాఫీ ఎంత ఖరీదైనా తాగేస్తున్నారు. చైనీయులు కూడా కాఫీ దాసులే. చెప్పాలంటే.. మొదటి స్థానంలో ఉన్నారు. కేవలం పన్నెండు నెలల వ్యవధిలో కాఫీ దుకాణాల సంఖ్య 58 శాతానికి పెరిగిందని, ప్రస్తుతం చైనాలో దాదాపు 50 వేల ఖరీదైన కాఫీ షాప్స్‌ ఉన్నాయని ‘వరల్డ్‌ కాఫీ పోర్టల్‌’ తెలియజేసింది. ప్రఖ్యాత స్టార్‌బక్స్‌ సంస్థ గత సంవత్సరం కొత్తగా సుమారు వెయ్యి దాకా కాఫీ షాప్స్‌ తెరిచింది. అందులో అత్యధిక పెట్టుబడులు పెట్టింది చైనాలోనే. తమకు అతి పెద్ద మార్కెట్‌ చైనాయేనని స్టార్‌బక్స్‌ సంస్థ తెలియజేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని