టర్కిష్‌ డిలైట్‌.. మహా సింపుల్‌!

ప్రస్తుతం ఫుడ్‌ వీడియోలదే హవా. ఆకట్టుకునేలా చెప్పే నైపుణ్యం ఉంటే చాలు.. కోట్లాదిమంది చూసేస్తారు. టర్కిష్‌ డిలైట్‌ వీడియోలో ఎంత సింపుల్‌గా స్వీట్‌ నేర్పారంటే..

Published : 24 Dec 2023 00:11 IST

ప్రస్తుతం ఫుడ్‌ వీడియోలదే హవా. ఆకట్టుకునేలా చెప్పే నైపుణ్యం ఉంటే చాలు.. కోట్లాదిమంది చూసేస్తారు. టర్కిష్‌ డిలైట్‌ వీడియోలో ఎంత సింపుల్‌గా స్వీట్‌ నేర్పారంటే.. 4 కప్పుల పంచదారలో కప్పున్నర నీళ్లు, 2 చెంచాల నిమ్మరసం, చెంచా నిమ్మతొక్క (లెమన్‌ జెస్ట్‌) వేసి.. కలియ తిప్పుతూ మరగ నివ్వాలి. మరో పాత్రలో మొక్కజొన్న పిండి, యోగర్ట్‌, నీళ్లు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, ఫుడ్‌ కలర్‌, ఇందాకటి మిశ్రమం కలిపి.. సన్న సెగ మీద ఉడికించాలి. చల్లారాక.. మొక్కజొన్న పిండిలో పంచదార పొడి కలిపి చల్లితే.. టర్కిష్‌ డిలైట్‌ తయారైపోతుంది. ‘డిష్‌డ్‌ షార్ట్స్‌’లో పోస్టయిన ఈ యూట్యూబ్‌ వీడియోకు 11 కోట్లకు పైగా వ్యూస్‌, 55 లక్షల లైక్స్‌ వచ్చాయి. నచ్చితే మీరూ ఓ లుక్కేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని