డ్రిల్‌ మిషన్ని ఇలా కూడా వాడొచ్చా!

గోడకు మేకు కొట్టాలంటే డ్రిల్‌ మిషన్‌ ఉపయోగించడం తెలిసిందే. దాంతో ఇంకేదైనా చేయొచ్చా- అనే తలపు మనకు పొరపాటున కూడా రాదు. కానీ స్పెయిన్‌లో ఓ వ్యక్తికి చిత్రమైన ఆలోచన వచ్చింది.

Published : 31 Dec 2023 00:19 IST

గోడకు మేకు కొట్టాలంటే డ్రిల్‌ మిషన్‌ ఉపయోగించడం తెలిసిందే. దాంతో ఇంకేదైనా చేయొచ్చా- అనే తలపు మనకు పొరపాటున కూడా రాదు. కానీ స్పెయిన్‌లో ఓ వ్యక్తికి చిత్రమైన ఆలోచన వచ్చింది. డ్రిల్లింగ్‌ యంత్రంతో ఫ్రూట్‌ జ్యూస్‌ చేసేశాడు. ఎలాగంటారా.. మిక్సీ జార్‌లో సగం వరకూ పండ్ల ముక్కలు వేసి, మూత బిగించాడు. జార్‌ కింది నుంచి డ్రిల్‌ మిషన్‌తో రంధ్రం చేసి, డ్రిల్‌ జిగ్‌ను (రంధ్రం చేసే మేకు) జార్‌లోకి పంపాడు. అంతే అది బర్రున తిరగడంతో పండ్లరసం తయారైపోయింది. డ్రిల్‌ చేస్తే జార్‌ పాడైపోదా? బ్లేడ్స్‌ ఎలా తిరుగుతాయి? పైగా ఫ్రూట్‌జ్యూస్‌ కిందికి లీకవ్వకుండా అందులో నిలుస్తుందా- లాంటి సందేహాలు అనేకం వస్తాయి. కానీ ప్రయోగం చేసిన వ్యక్తికి అలాంటి డౌట్లేం రాలేదు. అటు మిక్సీజార్‌, ఇటు పండ్ల ముక్కలూ కూడా గొప్ప అవగాహనతో పనిచేశాయి. దాంతో జ్యూస్‌ తయారైపోయింది. ఇన్‌స్టాలో ‘పీ ఫర్‌ యూ ఎల్‌ ఎక్స్‌’ అకౌంట్‌లో పోస్టయిన ఈ వీడియో వైరలైంది. సుమారు రెండున్నర కోట్ల వ్యూస్‌, 23 లక్షల లైక్స్‌ వచ్చాయి. ఫన్నీ కామెంట్లకూ కొదవ లేదు. మీరూ చూసి నవ్వుకోండి! కానీ ఇలాంటి ప్రయోగం మాత్రం చేయకండి ప్లీజ్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని