సాస్‌ అంతా తాగేశాడు..

మీరెప్పుడైనా టొమాటో సాస్‌ తాగారా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా! నిజమే, మనమైతే సాస్‌ తాగం. పిజ్జా, బర్గర్ల మీద కాస్త వేసుకుని తింటాం. కానీ జర్మనీకి చెందిన ఆండ్రే ఆర్టాల్ఫ్‌ సాస్‌ తాగేశాడు.

Updated : 07 Jan 2024 00:53 IST

మీరెప్పుడైనా టొమాటో సాస్‌ తాగారా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా! నిజమే, మనమైతే సాస్‌ తాగం. పిజ్జా, బర్గర్ల మీద కాస్త వేసుకుని తింటాం. కానీ జర్మనీకి చెందిన ఆండ్రే ఆర్టాల్ఫ్‌ సాస్‌ తాగేశాడు. కేవలం 55.21 క్షణాల్లో ఏకంగా లీటర్‌ టొమాటో సాస్‌ అవగొట్టేసి.. ‘అండర్‌ వన్‌ మినిట్‌ కేటగిరీ’లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు. వామ్మో.. మనిషా, మాంత్రికుడా.. అనిపిస్తోంది కదూ! ఉహూ.. అతడు ఏ మాయా చేయలేదు. టేబుల్‌ మీద గాజు జగ్గులో ఉన్న సాస్‌ను స్ట్రాతో వేగంగా తాగి ఆశ్చర్యపరిచాడు. ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో అబ్బురపరిచేలా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని